టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్!
- ఒక్క బై కానీ, లెగ్ బై కానీ లేకుండా 513 పరుగులు
- 494 పరుగులతో ఆసీస్ పేరుపై ఉన్న రికార్డు బద్దలు
- శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఘటన
ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులకు ఆలౌట్ అయింది. మొమినుల్ హక్ 176 పరుగులు చేయగా, ముష్ఫికర్ రహీం 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 83, ధనంజయ డి సిల్వా 104 పరుగులతో క్రీజులో ఉన్నారు.