కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు ఆగ్రహం.. కాసేపట్లో తమ నేతలతో కీలక భేటీ!
- కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి పెంచాలన్న అంశంపై చర్చించనున్న సీఎం
- కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెబుదామన్న చంద్రబాబు
- రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రుల ఆగ్రహం
ఏపీకి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఆదివారం తమ పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిద్దామని చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో అన్నారు. అలాగే, కాసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి పెంచాలన్న అంశంపై చర్చించనున్నారు.