కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు ఆగ్రహం.. కాసేపట్లో తమ నేతలతో కీలక భేటీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు ఆగ్రహం.. కాసేపట్లో తమ నేతలతో కీలక భేటీ!

  • కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి పెంచాలన్న అంశంపై చర్చించనున్న సీఎం
  • కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెబుదామన్న చంద్రబాబు
  • రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రుల ఆగ్రహం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వ తీరు సరిగాలేదని టీడీపీ మెజార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించలేదని పలువురు ఏపీ మంత్రులు అన్నారు. కొద్ది సేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై టెలీకాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులతో మాట్లాడగా మంత్రులందరూ కేంద్ర ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఆదివారం తమ పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిద్దామని చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో అన్నారు. అలాగే, కాసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి పెంచాలన్న అంశంపై చర్చించనున్నారు.  
Chandrababu
Andhra Pradesh
Arun Jaitly

More Telugu News