భారత్‌లో తీసుకొస్తోన్న శక్తిమంతమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణ‌లు అద్భుతం: అమెరికా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్‌లో తీసుకొస్తోన్న శక్తిమంతమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణ‌లు అద్భుతం: అమెరికా

  • భార‌త్-అమెరికాలకు చాలా విషయాల్లో ఒకేరకమైన విలువలున్నాయి
  • అవి ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి సహకరిస్తున్నాయి
  • డొనాల్డ్ ట్రంప్‌- న‌రేంద్ర‌ మోదీలది చాలా మంచి కాంబినేషన్‌
  • ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రశంసలు 
భారత్‌లో తీసుకొస్తోన్న శక్తిమంతమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయ‌ని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌ను కొనియాడారు. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సింగ్‌ సర్నా తన నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... భార‌త్-అమెరికాలకు చాలా విషయాల్లో ఒకేరకమైన విలువలున్నాయని, అవి ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి సహకరిస్తున్నాయని తెలిపారు.

భారత్‌తో స‌త్సంబంధాలు పెరుగుతుండడాన్ని త‌మ దేశ‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా ఇష్టపడుతున్నారని చెప్పారు. తాను డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలోకి అడుగుపెట్టగానే భార‌త్ తో త‌మ దేశ సంబంధాలు చాలా బలంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌- న‌రేంద్ర‌ మోదీలది చాలా మంచి కాంబినేషన్‌ అని వ్యాఖ్యానించారు.  
nikki haley
america
India

More Telugu News