వ్యభిచార రొంపి నుంచి టీవీ నటిని కాపాడిన ముంబై పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వ్యభిచార రొంపి నుంచి టీవీ నటిని కాపాడిన ముంబై పోలీసులు

  • ముంబైలో వ్యభిచారం నుంచి టీవీ నటికి విముక్తి
  • వాట్స్ యాప్ ద్వారా విటులతో సమాచార మార్పిడీ, బేరసారాలు
  • సమాచారంతో దాడులు చేసిన పోలీసులు
 టీవీ నటితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఆమెను కాపాడిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఆసిఫ్ దొరాజీవాలాకు ముంబైలో చిత్ర నిర్మాణ సంస్థ ఉంది. దాంతో ఆయనకు పలువురు టీవీ నటులతో పరిచయం కూడా ఉంది. అవకాశాల ఆశచూపి నటీమణులతో వ్యభిచారం చేయిస్తాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో ఆసిఫ్ దొరాజీవాలా ఒక టీవీ నటితో మలాద్ ప్రాంతంలో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దాడులు చేసిన పోలీసులు టీవీ నటిని కాపాడి, ఆసిఫ్ దొరాజీవాలా, విటుడు జే రాథోడ్ లను రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. వాట్స్ యాప్ ద్వారా విటులతో సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. టీవీ నటిని మహిళా సదనానికి తరలించిన పోలీసులు, ఆసిఫ్, రాథోడ్ లను రిమాండ్ కు తరలించారు. 
tv actress
prostitution
mumbai

More Telugu News