సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • గృహిణి పాత్రలో రకుల్ ప్రీత్ 
  • రాజకీయాల్లోకి రానున్న సమంత?
  • సొంత బ్యానర్లో నాగశౌర్య మరో సినిమా 
  • త్రిష, ప్రియమణి కలసి నటించే చిత్రం
*  రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో గృహిణి పాత్రలో కనిపించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే 'దాగుడు మూతలు' చిత్రంలో రకుల్ ఇలా గృహిణి పాత్రలో నటించనుందని సమాచారం. ఇందులో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు.
*  చెన్నయ్ బ్యూటీ, అక్కినేని వారి కోడలు సమంత త్వరలో రాజకీయాల్లోకి రానుందని, సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయనుందని ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా సమంత సన్నిహిత వర్గాలు వీటిని ఖండించాయి. సమంతకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పేర్కొన్నాయి.
*  తాజాగా తమ సొంత బ్యానర్లో 'ఛలో' చిత్రాన్ని చేసిన హీరో నాగశౌర్య త్వరలో మరో చిత్రాన్ని కూడా సొంత బ్యానర్ లో చేయనున్నాడు. నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో 'నర్తనశాల' టైటిల్ తో రూపొందే చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పై నిర్మించడానికి నాగశౌర్య తల్లిదండ్రులు ప్లాన్ చేస్తున్నారట.  
*  అందాలతారలు త్రిష, ప్రియమణి కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు వెర్నిక్ దర్శకత్వం వహించే ఈ తమిళ చిత్రం పేరు 'కుట్రప్పయిర్చి'. మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో త్రిష డిటెక్టివ్ పాత్రను పోషిస్తుందట.
Rakul
samantha
trisha

More Telugu News