సైకిల్ పై తన కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు
- స్మార్ట్ సైకిళ్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం
- కాలుష్య నివారణే లక్ష్యం
- సచివాలయంలో 30 సైకిళ్లు
సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా పాస్ వర్డ్, స్వైపింగ్ కార్డును కేటాయిస్తారు. ఈ పాస్ వర్డ్ ద్వారా మాత్రమే సైకిళ్లు తెరుచుకుంటాయి. పని పూర్తయిన తర్వాత ఈ మూడు స్టేషన్లలో ఎక్కడైనా సైకిళ్లను అప్పజెప్పవచ్చు. అల్యూమినియం, ఎల్లాయిడ్ తో తయారు చేయబడిన ఈ సైకిళ్లు వర్షంలో తడిసినా తుప్పుపట్టవు. ఈ సైకిళ్లకు మూడు గేర్లు ఉంటాయి. ఈ సందర్భంగా, స్మార్ట్ సైకిళ్లను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి ఓ సైకిల్ ను తొక్కుకుంటూ తన కార్యాలయానికి వెళ్లారు.