బాలయ్యను ఇబ్బంది పెడుతున్న భుజం గాయం.. త్వరలో సర్జరీ.. నాలుగు నెలల విశ్రాంతి!
- షూటింగ్లో గాయపడిన బాలయ్య
- తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న భుజం గాయం
- సర్జరీ చేయించుకోవాలని సూచించిన వైద్యులు
- తర్జన భర్జన పడుతున్న నందమూరి నటసింహం
శస్త్రచికిత్సకు ఓకే అన్న బాలయ్య, నాలుగు నెలలు విశ్రాంతి అంటే కష్టమని వైద్యులతో చెప్పారట. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని అనుకున్న సమయంలో పూర్తిచేయాలని భావిస్తున్న ఆయన, ఆపరేషన్ విషయంలో తర్జన భర్జన పడుతున్నట్టు టాలీవుడ్ టాక్. కుటుంబ సభ్యులు మాత్రం వెంటనే సర్జరీ చేయించుకోమని చెబుతున్నారట. అయితే బాలకృష్ణ నిర్ణయం ఏంటనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య తాజా చిత్రం ‘జై సింహా’ మంచి టాక్ సంపాదించుకుంది.