మహిళా సంఘాలకు పనేమీ లేదు.. నా సినిమాలప్పుడు కూడా ఇదే సమస్య వచ్చేది!: శృంగార నటి షకీలా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా సంఘాలకు పనేమీ లేదు.. నా సినిమాలప్పుడు కూడా ఇదే సమస్య వచ్చేది!: శృంగార నటి షకీలా

  • కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ సంస్థల్లో ఉద్యోగినుల డ్రెస్సింగ్ ఎలా ఉంటోంది?
  • ఇంకా మేమే నయం..చుడీదార్ లాంటివి ధరిస్తున్నాం
  • ‘గాడ్ సెక్స్ ట్రూత్’పై చాలా ఎక్కువ చేస్తున్న మహిళా సంఘాలు
  • ఓ ఇంటర్వ్యూలో షకీలా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ ఫిలింపై పలు మహిళా సంఘాలు ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రముఖ శృంగార నటి షకీలా స్పందించింది. 'ఎస్ టీవీ’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మహిళా సంఘాలకు పనేమీ లేదని, తన సినిమాలప్పుడు కూడా ఇదే సమస్య వచ్చేదని చెప్పింది.

‘ఇప్పుడు.. గ్లామర్ అన్నది లేకుండా ఎక్కడుంది? కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ సంస్థల్లో ఉద్యోగినులు ఏమైనా బాగా డ్రెస్ చేసుకుంటున్నారా? ఇంకా, మేమే చుడీదార్ లాంటివి వేసుకుంటున్నాం. వాళ్లు  జీన్స్, టాప్స్ అంటూ వేరే లెవెల్ లో ఉన్నారు. ఇలాంటి విషయాలను మహిళా సంఘాలు ప్రశ్నించవచ్చు కదా? నిరసన వ్యక్తం చేయొచ్చు కదా? ‘సినిమా’ అనేది ఒక ఎంటర్ టెైన్ మెంట్. ఎన్నో డబ్బులు పెట్టి ఇది (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) తీశారు. ఇష్టం ఉంటే వెళ్లి చూడండి..లేకుంటే మీ వాళ్లను కూడా ఆపండి. అంతేతప్పా, విడుదల చేయకూడదంటూ మహిళా సంఘాలు చాలా ఎక్కువ చేస్తున్నాయి. ‘పోర్న్’ సినిమాలు చూసి యువత చెడిపోతున్నారనడం తప్పు. బాంబు బ్లాస్ట్, క్రైమ్ సినిమాలు చూసి అలాగే చెడిపోతున్నారా?’ అని ప్రశ్నించింది షకీలా.
shakeela
Tollywood
ram gopal varma

More Telugu News