'నా పేరు సూర్య' ఏ సినిమాకి కాపీ కాదంటోన్న టీమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నా పేరు సూర్య' ఏ సినిమాకి కాపీ కాదంటోన్న టీమ్

  • వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య'
  • ఓ ఆంగ్ల చిత్రానికి కాపీ అంటూ టాక్ 
  • ఈ విషయంపై స్పందించిన టీమ్  
'అజ్ఞాతవాసి' సినిమా ఓ ఫ్రెంచ్ సినిమాకి కాపీ అనే విషయం జనంలోకి బాగా దూసుకుపోయింది. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తోన్న 'నా పేరు సూర్య' సినిమా కూడా 'యాంట్ వోన్ ఫిషర్' అనే ఆంగ్ల చిత్రానికి కాపీ అనే ప్రచారం రీసెంట్ గా ఊపందుకుంది. ఈ టాక్ ఈ సినిమా టీమ్ వరకూ చేరడంతో, వెంటనే వాళ్లు స్పందించారు.

 'నా పేరు సూర్య' ఏ సినిమాకి కాపీ కాదనీ, 'యాంట్ వోన్ ఫిషర్' అనే ఆంగ్ల చిత్రానికీ .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదంటూ స్పష్టం చేశారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశలో వుంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  
Allu Arjun
anu

More Telugu News