మీకు ద్రవిడ్ ఉన్నాడు...మరి మాకో?.. పాక్ ఫ్యాన్స్ నిరాశ!
- టీమిండియాకు ద్రవిడ్ లాంటి లెజెండ్ కోచ్ గా ఉన్నాడు
- పాక్ కు మన్సూర్ రానా కోచ్
- కేవలం రెండు వన్డేలు ఆడి 15 పరుగులు చేసిన రానాను కోచ్ గా ఎందుకు పెట్టుకున్నారో?
పాక్ కు మాత్రం అలాంటి వ్యక్తి కోచ్ గా లేడని, పాక్ కోచ్ మన్సూర్ రానా ఆడింది కేవలం రెండు వన్డేలు, చేసింది 15 పరుగులేనని, కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని వ్యక్తిని కోచ్ గా ఎందుకు పెట్టుకున్నారోనని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో భారత క్రికెట్ భవిష్యత్ సరైన వ్యక్తి చేతుల్లోనే ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.