త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్?

  • త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ 
  • మార్చిలో రెగ్యులర్ షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుథ్    
త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో మొదలుపెట్టనున్నాడు. ఒక వైపున ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో త్రివిక్రమ్ బిజీగా వుంటే, మరో వైపున ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించడం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్తలు వినిపించాయి.

 తాజాగా శ్రద్ధా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి పూజా హెగ్డేతో పాటు శ్రద్ధా కపూర్ ను తీసుకోనున్నారా? లేదంటే పూజా హెగ్డే స్థానంలో శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి, అనిరుథ్ సంగీతాన్ని అందించనున్నాడు. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  
ntr
trivikram

More Telugu News