పాక్ ఆటగాళ్ల స్కోర్ కార్డు... 2, 7, 18, 1, 4, 4, 15, 1, 0, 1... 203 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం!
- పరుగుల వేటలో చతికిల పడ్డ పాకిస్థాన్
- 69 పరుగులకే ఆలౌట్ అయిన పాక్
- అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ కు భారత్
పాక్ జట్టులో ఇమ్రాన్ 2, జయీద్ 7, రోహాయిల్ 18, జార్యాబ్ 1, అమ్మద్ 4, తాహా 4, సాద్ 15, హసన్ 1, షహీన్ 0, అర్షాద్ 1 పరుగు చేయగా, మూసా 11 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో ఈషాన్ 4 వికెట్లు తీసి రాణించగా, శివ, రియాన్ లకు చెరో రెండు, అనుకుల్, అభిషేక్ లకు చెరో వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ లో విజయంతో ఇండియా ఫైనల్స్ కు ప్రవేశించింది. ఇక తౌరంగా స్టేడియంలో శనివారం నాడు ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.