స్పైస్ జెట్ కు 20 కొత్త విమానాలు... 10 నవ్యాంధ్రకు!
- 'కనెక్టెడ్ ది అన్ కనెక్టెడ్' స్కీమ్ లో భాగంగా కొత్త సేవలు
- విశాఖ నుంచి కోల్ కతాకు డైరెక్ట్ ఫ్లయిట్
- చెన్నై - విశాఖపట్నం మధ్య కూడా
- దక్షిణాదికి 18 విమానాలు కేటాయించిన స్పైస్ జెట్
ఇక ఏపీకి కేటాయించే విమానాలు చెన్నై - విశాఖపట్నం, కోల్ కతా - విశాఖపట్నం, చెన్నై - విజయవాడ మార్గాల్లో నాన్ స్టాప్ గా తిరుగుతాయి. వీటితో పాటు చెన్నై, విశాఖపట్నం, కోల్ కతా, విజయవాడ మధ్య రోజువారీ విమానాలను, బెంగళూరు - తిరుపతి మధ్య మంగళవారం మినహా సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో 18 విమానాలతో మెట్రో, నాన్ మెట్రో నగరాల మధ్య సర్వీసులను నడిపిస్తామని స్పైస్ జెట్ పేర్కొంది.