పీకల్దాక తాగి రోడ్డుపై బీభత్సం సృష్టించిన పోలీసు అధికారి.. పలువురికి గాయాలు.. పరారీలో సీఐ

  • మద్యం మత్తులో వాహనంతో హల్‌చల్ చేసిన సీఐ గిరీష్
  • పలువురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
  • పరారీలో సీఐ.. కఠిన చర్యలు తీసుకుంటామన్న సీపీ మహేశ్ భగవత్
హైదరాబాద్‌లోని అంబర్‌పేట ట్రైనింగ్ సెంటర్ సీఐ జి.గిరీష్ రావ్ పీకల్దాక తాగి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో నానా హంగామా చేశాడు. రాంగ్ రూట్‌లో వాహనాన్ని నడుపుతూ, అడ్డొచ్చిన వాహనాలను ఢీకొడుతూ నానా యాగీ చేశాడు. మేడ్చల్ జిల్లా  జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ హనుమాన్ ఆలయం వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

సీఐ వాహనం ఢీకొని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాక్టివాపై వెళ్తున్న దంపతుల కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటన అనంతరం సీఐ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. పరారీలో ఉన్న గిరీష్ కోసం గాలింపు మొదలుపెట్టారు. గిరీష్‌పై తీవ్ర చర్యలు ఉంటాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని సీపీ పేర్కొన్నారు.
Go Back to Shorts
Telangana
Police
Hyderabad
Girish

More Telugu News