తిరుమల దారిలో భారీగా పేలుడు పదార్థాలు.. వణికిపోతున్న భక్తులు
- కలకలం సృష్టించిన పేలుడు పదార్థాలు
- భారీగా లభ్యమైన కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
టాస్క్ఫోర్స్ పోలీసుల సోదాల్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులు లభ్యమయ్యాయి. దుండగులు వీటిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రత ఉన్నప్పటికీ వీటిని ఇక్కడి వరకు ఎలా తీసుకురాగలిగారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోలీసుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.