పాకిస్థాన్‌లో అత్యాచారాల‌కు కార‌ణం బాలీవుడ్డే!: పాక్ నెటిజ‌న్ల అభిప్రాయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్‌లో అత్యాచారాల‌కు కార‌ణం బాలీవుడ్డే!: పాక్ నెటిజ‌న్ల అభిప్రాయం

  • అస‌భ్య కార్య‌క్ర‌మాల వ‌ల్లే అత్యాచారాలు
  • మ‌ళ్లీ తెర మీద‌కి వ‌చ్చిన రేప్‌ల అంశం
  • అక్క‌డ సంచ‌ల‌నం సృష్టిస్తోన్న 7 ఏళ్ల బాలిక రేప్‌, మ‌ర్డ‌ర్‌
పాకిస్థాన్‌లో ఇటీవ‌ల జైనాబ్ అనే 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిపి, హ‌త్య చేసి శవాన్ని రోడ్డుమీద ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా పాకిస్థాన్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అత్యాచారాలు జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాల విశ్లేష‌ణ అక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో భాగంగా #StopVulgarityOnMedia అనే హ్యాష్‌ట్యాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

సినిమాలు, టీవీ కార్య‌క్ర‌మాల్లో చూపించే అసభ్య స‌న్నివేశాల కార‌ణంగా పాక్ యువ‌త ప్ర‌భావిత‌మ‌వుతోందని నెటిజ‌న్లు అంటున్నారు. అంతేకాకుండా అక్క‌డ అత్యాచారాల‌కు ప్ర‌ధాన కార‌ణం బాలీవుడ్ సినిమాలేన‌ని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే బాలీవుడ్ సినిమాలు, భార‌తీయ సీరియ‌ళ్లు, టీవీ షోలపై నిషేధం విధించాల‌ని వారు కోరుతున్నారు. పాకిస్థాన్ సంస్కృతిలో అశ్లీల‌త భాగం కాద‌ని, టెలివిజ‌న్ కంటెంట్ పేరుతో అస‌భ్య‌త‌ను సంస్కృతిలో భాగం చేస్తున్నారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చివ‌రికు ఉదయాన్నే వ‌చ్చే వార్త‌ల్లోనూ అశ్లీల‌తను చూపిస్తున్నార‌ని ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేస్తున్నారు.
Pakistan
rape
india
Bollywood

More Telugu News