అమెరికా మోడల్ కు విమానంలో ఘోర అవమానం!
- న్యూయార్క్ కు చెందిన ఫిట్ నెస్ మోడల్ జెన్ సెల్టర్
- అమెరికన్ ఎయిర్ లైన్స్ వివాదం
- విమానం నుంచి కిందికి దించేసిన సిబ్బంది
విమానం బయలుదేరడానికి రెండున్నర గంటలు ఆలస్యం కావడంతో, ఆమె సీట్లో కూర్చోలేక నిల్చున్నారు. దీంతో విమాన సిబ్బంది ఆమెను సీట్లో కూర్చోవాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ఎంతసేపు కూర్చోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు పైలట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో విమానంలోకి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బలవంతంగా విమానంలోంచి దించేశారు. ఆమె పక్కనున్నవారు వారిని వారించినా వారు వినకపోవడం విశేషం. ఈ సందర్భంగా తీసిన సెల్ ఫోన్ వీడియోలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.