డ్రాగన్ కంట్రీ మరో రికార్డు.. కేవలం 9 గంటల్లోనే రైల్వే స్టేషన్ను నిర్మించిన చైనా!
- నిర్మాణ రంగంలో తమకు తిరుగులేదని నిరూపించిన చైనా
- 1500 మంది సిబ్బంది, కార్మికులతో రైల్వే స్టేషన్ నిర్మాణం
- స్టేషన్ నిర్మాణంతో 7 గంటల ప్రయాణం గంటన్నరకు తగ్గిన వైనం
దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా 247 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం రూ. 7 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. తాజాగా నిర్మించిన రైల్వే స్టేషన్ అందులో భాగమే. ఈ స్టేషన్ నిర్మాణం వల్ల మధ్య-ఆగ్నేయ చైనాల మధ్య ఉన్న 7 గంటల ప్రయాణ దూరం ఇకపై గంటన్నరకు తగ్గిపోనుంది.