న్యాయమూర్తిగా పదవి చేపట్టిన వెంటనే రాజకీయ సంబంధాలు వదులుకున్నా: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్
- ఓ రాజకీయ పార్టీ వానిగా పేర్కొనడం సరికాదు
- భావ ప్రకటనా స్వేచ్ఛతో ఏది పడితే అది మాట్లాడరాదు
- పౌరులందరికీ సమానత్వం అసాధ్యంగా మారింది
విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి జస్టిస్ చలమేశ్వర్ హాజరై మాట్లాడారు. పౌరులందరికీ సమానత్వం కల్పించాలన్నది మన రాజ్యంగ ధర్మంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లోనూ సమానత్వం సాధించాలన్నది లక్ష్యమన్నారు. కానీ, ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోవడం, అవినీతి, వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్నారు.