పరిటాల ఇంటికి పవన్... సునీతతో కలసి టిఫిన్!
Add ap7am to your home Screen

పరిటాల ఇంటికి పవన్... సునీతతో కలసి టిఫిన్!

  • ప్రస్తుతం అనంత పర్యటనలో పవన్
  • ఈ ఉదయం పరిటాల సునీతతో భేటీ
  • ఆపై కదిరిలో పర్యటించనున్న జనసేనాని
తన అనంతపురం పర్యటనలో భాగంగా, ఈ ఉదయం కదిరికి బయలుదేరే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. పవన్ ను ఆహ్వానించిన పరిటాల శ్రీరామ్, ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పరిటాల వారింట పవన్ కల్యాణ్ అల్పాహారాన్ని తీసుకున్నారు. దాదాపు గంట పాటు సునీతతో పలు విషయాలపై పవన్ మాట్లాడినట్టు తెలుస్తోంది.

రాయలసీమలో కరవు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై వీరు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కాగా, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Paritala Sunita
Anantapur District
Kadiri
Janasena

More Telugu News