Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా సీన్‌ను తలపించేలా రహదారిపై కారుని వెంబడించిన పోలీసులు.. చివరికి ఘోర ప్రమాదం.. వీడియో చూడండి!

  • అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఘటన
  • తప్పించుకుని రెడ్ కలర్ కారులో పారిపోతోన్న ఓ నిందితుడు
  • మరో కారుని ఢీ కొన్న నిందితుడు
  • ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో సినిమా సీన్‌ను త‌ల‌పించేలా పోలీసులు ఓ నిందితుడి కారును వెంబ‌డించారు. కొన్ని కిలోమీట‌ర్ల పాటు కొన‌సాగిన ఈ ఛేజింగ్‌లో చివరకు నిందితుడి కారు ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. ఇందులో రెడ్ కలర్ కారులో నిందితుడు పారిపోతున్నాడు. వెనుక పోలీస్ వ్యాను వస్తుండగా నిందితుడు వారికి చిక్కకుండా కొన్ని కిలోమీటర్లు తప్పించుకోగలిగాడు.

చివరకు ఓ ఎక్స్ రోడ్ వద్ద సిగ్నల్ పడడంతో కొన్ని క్షణాలు ఆపాడు. ఇంతలో పోలీసులు ఆ నిందితుడి కారు వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా మళ్లీ వేగం పుంజుకుని ముందుకు దూసుకెళ్లాడు. ఆ కొద్దిసేపటికే ఓ కారుని ఢీ కొట్టాడు. దీంతో నిందితుడి కారుతో పాటు అతడు ఢీ కొట్టిన కారు ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. నిందితుడికి స్వల్పగాయాలు కాగా, అతడు ఢీ కొట్టిన కారులోని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. గాయాలపాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సదరు నిందితుడిపై పలు కేసులు ఉన్నాయని అక్కడి పోలీసులు చెప్పారు. ఈ వీడియోను మీరూ చూడండి...
car
Accidents
america

More Telugu News