Nani: జూబ్లీహిల్స్ లో ప్రమాదానికి గురైన సినీనటుడు నాని కారు.. కేసు నమోదు
సినీనటుడు నానికి చెందిన ఓ కారు ఈ రోజు ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45లో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు, ఒక్కసారిగా అది అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు 3/పీపీడీఏ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.