తెలుగు టీవీ చానల్ యాంకర్ కు వేధింపులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు టీవీ చానల్ యాంకర్ కు వేధింపులు!

  • పెళ్లి చేసుకోవాలని వేధింపులు
  • చానల్ కార్యాలయంలోనే ఘటన
  • ఇప్పటికే బాధితురాలికి వివాహం
  • అయినా వదలని దుర్మార్గుడు
"నిన్నే పెళ్లి చేసుకుంటాను... నువ్వంటే ఇష్టం" అని చెబుతూ హైదరాబాదులోని ఓ తెలుగు టీవీ చానల్ ఆఫీసుకు వెళ్లి, యాంకర్ ను వేధిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవీందర్ (25) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, టీవీలో సదరు యాంకర్ ను నిత్యమూ చూస్తుండే రవీందర్, ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో, ఆమెను అడగాలన్న ఉద్దేశంతో రెండు రోజుల క్రితం నగరానికి వచ్చాడు.

ఆపై చానల్ కార్యాలయానికి వెళ్లి, ఉద్యోగులందరూ చూస్తుండగానే తన కోరికను చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి రవీందర్ ను అరెస్ట్ చేశారు. కాగా, గత నాలుగైదేళ్లుగా రవీందర్ కు, యాంకర్ కు పరిచయం ఉందని తెలుస్తోంది. 2014లోనూ అతను ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టు పోలీసు కేసు నమోదు అయింది. యాంకర్ కు ఇప్పటికే వివాహమైన విషయం రవీందర్ కు తెలుసునని, అయినా పద్ధతి మార్చుకోలేదని, అతన్ని విచారించి కోర్టు ముందు నిలుపుతామని పోలీసులు వెల్లడించారు.
Telugu
Channel
Anchor
Harrasment

More Telugu News