అందాల పోటీలో అగ్ని ప్రమాదం... ర్యాంప్‌ మీదే మోడ‌ల్‌ త‌ల మీద మంట‌లు.. వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందాల పోటీలో అగ్ని ప్రమాదం... ర్యాంప్‌ మీదే మోడ‌ల్‌ త‌ల మీద మంట‌లు.. వీడియో చూడండి!

  • క్వీన్ ఆఫ్ హార్వెస్ట్‌గా త‌యారైన మోడ‌ల్‌
  • ప‌క్క‌న ఉన్న కాగ‌డాకు త‌గ‌ల‌డంతో మంట‌లు
  • ఎల్ సాల్వ‌డార్‌లో జ‌రిగిన పోటీలు
అందాల పోటీలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం అందరినీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. ర్యాంప్ మీద న‌డుస్తున్న మోడ‌ల్ తల మీది అలంక‌ర‌ణ‌కు నిప్పంటుకుని మంట‌లు వ్యాపించాయి. ఎల్ సాల్వ‌డార్‌లో జ‌రిగిన అందాల పోటీల్లో ఓ మోడ‌ల్ 'క్వీన్ ఆఫ్ హార్వెస్ట్‌'గా అలంక‌రించుకుంది. అలా ర్యాంప్ మీద న‌డ‌వ‌డం మొద‌లు పెట్టింది. ఈలోగా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా ప‌క్క‌నే కాగ‌డాకు త‌గిలి మంట‌లు అంటుకున్నాయి. ఆమె త‌ల మీద ఉన్న అలంక‌ర‌ణ పోగులు పోగులుగా ఉండ‌టంతో మంట‌లు త్వ‌ర‌గా వ్యాపించాయి.

వెంట‌నే ప‌క్క‌న ఉన్న సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై మంట‌లు ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ప్ర‌మాదంలో ఆ మోడ‌ల్‌కి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదంటూ నిర్వాహ‌కులు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన‌ట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ramp walk
Fire Accident
el salvador

More Telugu News