లావణ్యను అరెస్టు చేయాలన్న అభిమాని.. గడుసుగా సమాధానం చెప్పిన ముద్దుగుమ్మ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లావణ్యను అరెస్టు చేయాలన్న అభిమాని.. గడుసుగా సమాధానం చెప్పిన ముద్దుగుమ్మ!

  • ‘ఇంటిలిజెంట్‌’ సినిమా ప్రమోషన్ లో బిజీగా లావణ్య
  • ప్రమోషన్ ఈవెంట్ కు వెళ్లే ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన లావణ్య
  • లావణ్యను అరెస్టు చేయాలన్న అభిమాని వరుణ్
విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువనటి లావణ్య త్రిపాఠిని అరెస్ట్‌ చేయాలంటూ చేసిన అభిమాని ట్వీట్ కి ఆమె గడుసుగా సమాధానం చెప్పింది. సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన ‘ఇంటిలిజెంట్‌’ సినిమాను లావణ్య తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమానికి వెళ్లిన లావణ్య పసుపు రంగు గౌనులో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది.

దీనికి వరుణ్‌ రెడ్డి అనే అభిమాని ఆమెకు ట్యాగ్ చేస్తూ, ‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్‌ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిని చూసిన లావణ్య సమాధానమిస్తూ, ‘హా హా..మా నాన్న లాయర్‌’ అంటూ గడుసుగా సమాధానం ఇచ్చింది. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
lavanya tripathi
intelligent movie
Twitter

More Telugu News