ఓటర్లుగా నమోదు చేసుకోండి... మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి: మోదీ పిలుపు
- ఓటుకున్న శక్తి అపారం
- దాన్ని వినియోగించుకోవాలి
- ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు
‘‘అర్హులైన ఓటర్లందరినీ, ముఖ్యంగా యువతను నేను కోరేదేమంటే, తమ తమ పేర్లను నమోదు చేసుకుని ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఓటుకు ఉన్న శక్తి అపారమన్నారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడగా, ఏటా ఈ రోజును ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు.