ఆ వార్తల్లో నిజం లేదు: 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్రరావు వివరణ

  • టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు అంటూ వార్తలు
  • ఖండించిన దర్శకేంద్రుడు
  • స్వామివారి సేవలో తరించాలన్నదే తన కోరిక అని స్పష్టం
గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలలోను, సోషల్ మీడియాలోను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాదిమంది ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కె. రాఘవేంద్రరావు ఖండించారు. ఎస్.వి.ఎస్.సి. ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్న తాను ఈ ఛానెల్లో స్వామివారిపై మరిన్ని కొత్త కార్యక్రమాలని వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరిస్తూ, స్వామివారి సేవలో తరించాలన్నది ఒక్కటే తన కోరిక అని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు.
Go Back to Shorts
raghavendra rao
tollywood
ttd

More Telugu News