దేశానికి ఏదో ఒకటి చేయాలనే తిరిగి వచ్చేశాను!: గ్రేట్ ఖలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశానికి ఏదో ఒకటి చేయాలనే తిరిగి వచ్చేశాను!: గ్రేట్ ఖలీ

  • టెక్సాస్ లో సొంత ఇల్లు, వ్యాపారం కూడా ఉన్నాయి
  • దేశానికి ఏదో ఒకటి చెయ్యాలనే భారత్ కు తిరిగి వచ్చేశాను
  • నా సంపాదనంతా జలంధర్ లోని సీడబ్ల్యూఈ అకాడమీకి ఖర్చు చేస్తున్నాను
దేశానికి ఏదో ఒకటి చెయ్యాలనే తాను భారత్ కు తిరిగి వచ్చేశానని 'డబ్ల్యూడబ్ల్యూఈ' ఫేం గ్రేట్ ఖలీ తెలిపాడు. పంజాబ్‌ లోని అమృత్‌ సర్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు అమెరికాలోని టెక్సాస్‌ లో ఇల్లు ఉందని తెలిపాడు. అలాగే వ్యాపారం కూడా ఉందని చెప్పాడు. సాధారణంగా ఎవరైనా ఒకసారి అమెరికా వెళ్లి చిన్న దుకాణం తెరిచారంటే, ఇక వారికి తిరిగి రాబుద్ధికాదని అన్నాడు.

అయితే తనకు మాత్రం దేశానికి ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంటుందని చెప్పాడు. అందుకే తిరిగి స్వదేశానికి వచ్చేశానని చెప్పాడు. తన సంపాదనంతటినీ జలంధర్‌ లో సీడబ్ల్యుఈ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఖర్చుపెడుతున్నానని తెలిపాడు. ప్రస్తుతం మల్లయుద్ధంలో తన వద్ద 250 మంది శిక్షణ పొందుతున్నారని చెప్పాడు. ఈ క్రీడను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించాడు. ఈ క్రీడారంగంలో భారత్‌ లోని టాలెంట్‌ ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే తన లక్ష్యమని ఖలీ తెలిపాడు. 
WWE
great khali
punjab

More Telugu News