ఐఫోన్ బ్యాట‌రీని నోటితో కొర‌కొద్దు...అది పేలుతుంది.. వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఫోన్ బ్యాట‌రీని నోటితో కొర‌కొద్దు...అది పేలుతుంది.. వీడియో చూడండి!

  • చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఘ‌ట‌న‌
  • తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం
  • వైర‌ల్‌గా మారుతున్న వీడియో
ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఐఫోన్ బ్యాట‌రీని నోటితో కొర‌క‌కండి. ఎందుకంటే అది పేలుతుంది. కావాలంటే కింద ఉన్న వీడియో చూడండి. చైనాలోని ఓ ఎల‌క్ట్రానిక్ స్టోర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. తైవాన్ న్యూస్ పత్రిక పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం, వీడియోలో క‌నిపిస్తున్న యువ‌కుడు ఐఫోన్ బ్యాట‌రీ కొన‌డానికి స్టోర్‌కి వ‌చ్చాడు. అయితే చైనాలో న‌కిలీ ఐఫోన్ బ్యాట‌రీలు కూడా అమ్ముతుండ‌టంతో వాటి విశ్వ‌స‌నీయ‌త ప‌రీక్షించ‌డానికి ఒక బ్యాట‌రీని నోటితో కొరికాడు. బ్యాట‌రీని నోటి నుంచి బ‌య‌టికి తీసిన మ‌రుక్ష‌ణంలో అది పేలిపోవ‌డం స్టోర్ సీసీ కెమెరాలో రికార్డయింది.

అదృష్ట‌వ‌శాత్తు ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అయితే ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దాదాపు 50 ల‌క్ష‌ల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసి ఎవ‌రూ ఐఫోన్ బ్యాట‌రీల‌ను నోటితో కొరికి ప‌రీక్షించ‌వ‌ద్ద‌ని మ‌నవి.

iphone
battery
apple
china
explosion

More Telugu News