Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖర్చునంతా భరించి, పెళ్లి చేయించిన హీరో సూర్య

  • తన వద్ద పని చేసే యువకుడి పెళ్లి చేసిన సూర్య
  • కుటుంబం మొత్తం హాజరు
  • సూర్య మంచి మనసు పట్ల సర్వత్ర హర్షం
తమిళ హీరో సూర్య కుటుంబం తమిళ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. మిగిలిన సినీ ప్రముఖులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాలతో సంబంధం కలిగి ఉంటారు. కానీ, రాజకీయాలతో సంబంధం లేకుండా సూర్య కుటుంబం స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది.

'అరగం' ఫౌండేషన్ ద్వారా సూర్య పలు సేవాకార్యక్రమాలను చేస్తుంటాడు. సూర్య, కార్తీలు తమ అభిమానులతో చాలా ఆప్యాయంగా మెలుగుతుంటారు. తాజాగా తన వద్ద పని చేసే ఓ యువకుడికి సూర్య దగ్గరుండి మరీ పెళ్లి చేయించాడు. ఈ పెళ్లికి మొత్తం ఫ్యామిలీతో కలసి సూర్య వచ్చాడు. పెళ్లి తాళిని స్వయంగా తానే అందించడమే కాక, పెళ్లి మొత్తం ఖర్చును తానే భరించాడు. తన వద్ద పని చేసే వ్యక్తుల పట్ల సూర్య చూపించిన అభిమానం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. 
suria
kollywood
tollywood

More Telugu News