Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జియోకు దీటుగా ఎయిర్ టెల్ డేటా ప్లాన్లు... రోజుకు 1.4 జీబీ డేటా

  • రూ.199, 448, 509 ప్యాక్ లపై అదనపు డేటా
  • జియో ఆఫర్లతో ఎయిర్ టెల్ సైతం ఇదే నిర్ణయం
  • మిగిలిన ప్రయోజనాలు యథాతథం
రిలయన్స్ జియో అన్ని ప్లాన్లపై రోజుకు అర జీబీ అదనంగా ఇస్తూ రిపబ్లిక్ డే ఆఫర్ ప్రకటించగా, పోటీ సంస్థ ఎయిర్ టైల్ సైతం ఈ దిశగా అడుగులేసింది. రూ.199 (28 రోజులు), రూ.448(82 రోజులు), రూ.509(90 రోజులు) ప్యాక్ లపై ఇక నుంచి ప్రతీ రోజూ 1.4 జీబీ అధిక వేగంతో కూడిన డేటాను పొందొచ్చు. ఇక అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంలో ఎటువంటి మార్పు లేదు. ఇక రూ.349 ప్లాన్ లో ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా, 70 రోజుల వ్యాలిడిటీతో కూడిన రూ.399 ప్లాన్ లో రోజుకు 1జీబీ డేటా అందుతుంది.
airtel

More Telugu News