Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే నెలలో సెట్స్ పైకి 'యూటర్న్' .. రంగంలోకి సమంత

  • కన్నడలో హిట్ కొట్టిన 'యూటర్న్'
  • ఈ మూవీ 'రీమేక్ లో సమంత 
  • తెలుగు .. తమిళ భాషల్లో నిర్మాణం  
ప్రస్తుతం సమంత చేసిన రెండు సినిమాలు చాలా తక్కువ గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. తెలుగులో చేసిన 'రంగస్థలం' .. మార్చి 30వ తేదీన విడుదల కానుంది. తమిళంలో చేసిన 'ఇరుంబు తిరై' ను మొదట ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత ఈ సినిమాను కూడా మార్చిలోనే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తెలుగు ... తమిళ భాషల్లో 'యూటర్న్' సినిమా చేయడానికి సమంత రెడీ అవుతున్నట్టు సమాచారం. కన్నడలో హిట్ కొట్టిన ఈ సినిమాను ఈ రెండు భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్ .. తెలుగు .. తమిళ సినిమాలకి కూడా దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మించే ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. ఈ రెండు భాషల్లోను సమంతనే ప్రధానమైన పాత్రను పోషించడం విశేషం.
samanta

More Telugu News