హైదరాబాద్ లో కలకలం... టీవీ చానెల్ కెమెరామెన్ ను కత్తితో పొడిచిన కో-డైరెక్టర్!
- ఇందిరానగర్ లో ఘటన
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన కెమెరామెన్
- పరారీలో కో-డైరెక్టర్, కేసు నమోదు
తరచూ నిద్రలో లేచే రాంరెడ్డి, తనను ఎవరో చంపడానికి వస్తున్నారని అరుస్తుండేవాడు. అదే విషయాన్ని 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసేవాడు. ఆపై పోలీసులు విచారించి, అది అపోహ మాత్రమేనని కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతుండేవారు. ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట సమయంలో వర్మ మేడపై ఉండగా, కూరగాయల కత్తితో వచ్చి రాంరెడ్డి దాడి చేసి, పొట్టలో పొడిచాడు. ఈ క్రమంలో వర్మ చేతులకు కూడా గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగెత్తాడు. అయినప్పటికీ రాంరెడ్డి వెంబడించడంతో, ఓ ఏటీఎం పక్కన నక్కాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయిన వర్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని నిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్చారు. రాంరెడ్డి పరారీలో ఉన్నాడని, కేసు దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.