Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాస్‌పోర్ట్‌, బోర్డింగ్‌ పాస్‌ లేకుండానే విమానంలో ప్రయాణం.. ఎట్టకేలకు పట్టుకున్న అధికారులు

  • హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
  • బ్రిటన్‌కు చెందిన మారిలిన్‌ హార్ట్‌మెన్‌ అనే 66 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
  • జుట్టుతో తన ముఖాన్ని కవర్‌ చేసుకుని విమానం ఎక్కేస్తోన్న వైనం
ఓ వృద్ధురాలు పాస్‌పోర్ట్‌, బోర్డింగ్‌ పాస్‌ వంటివి ఎమీ లేకుండానే అంతర్జాతీయ విమానం ఎక్కేసిన ఘ‌ట‌న హరే ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానంలో చోటు చేసుకుంది. ఎట్ట‌కేల‌కు ఈ విష‌యాన్ని గుర్తించిన బ్రిటన్‌ కస్టమ్స్‌ అధికారులు ఆమెను లండ‌న్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, బ్రిటన్‌కు చెందిన మారిలిన్‌ హార్ట్‌మెన్‌ అనే 66 ఏళ్ల వృద్ధురాలు విమానాశ్రయంలోని సీసీ కెమెరాలను పరిశీలించుకుంటూ తనిఖీ అధికారులను సమీపించే సమయంలో జుట్టుతో తన ముఖాన్ని కవర్‌ చేసుకుంది. వేగంగా నడుస్తూ ముందుకు వెళ్లిపోయింది.

ఆమె హుందాగా కనపడడంతో పాటు వృద్ధురాలు కావడంతో ఆమె వద్ద పాస్‌పోర్ట్‌, బోర్డింగ్‌ పాస్‌ ఉంటాయని కస్టమ్స్ అధికారులు అనుకున్నారు. దీంతో ఆమె ఎంచ‌క్కా విమానం ఎక్కేసి, కాసేపు బాత్‌రూంలో కూర్చుంది. ఆ త‌రువాత బాత్‌రూంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి విమానంలో ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. తాను గతంలోనూ మూడు సార్లు ఇదే విధంగా ప్రయాణించానని విచారణలో ఆ వృద్ధురాలు ఒప్పుకోవడంతో అధికారులు షాక్‌ అయ్యారు.  
airport
women
arrested
London

More Telugu News