రాంగోపాల్ వర్మపై అనంతపురంలో పోలీస్ కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాంగోపాల్ వర్మపై అనంతపురంలో పోలీస్ కేసు

  • వర్మ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’పై విమర్శలు
  • వర్మపై అనంతపురం, విజయవాడ పోలీస్ స్టేషన్లలో కేసులు
  • వర్మ తీరు మార్చుకోవాలని హెచ్చరికలు
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఫిర్యాదు చేశారు. నీలి చిత్రాల నటి మియా మాల్కోవాతో ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమాపై వారు మండిపడ్డారు. దేవుళ్లను కించపరుస్తూ అశ్లీలచిత్రం రూపొందించిన వర్మపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 కాగా, గత శుక్రవారం విజయవాడలో కూడా బీజేపీ మహిళా మోర్చా నేతలు వర్మపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వర్మ తన తీరు మార్చుకోకపోతే ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. 
ramgopal verma
bjp
police case

More Telugu News