తన పోజును తానే అనుకరించిన షారుక్ ఖాన్... వైరల్ అవుతున్న ఫొటో
- మంచులో తన పోజు పెట్టి ఫొటో దిగిన షారుక్
- స్విట్జర్లాండ్‌లో ఉన్న నటుడు
- క్రిస్టల్ అవార్డ్స్ వేడుకకు హాజరు
ఆయన నటించిన 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' చిత్రం స్విట్జర్లాండ్‌లోనే జరిగింది. ఆ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఈ పోజు పెట్టినట్లు షారుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అక్కడి దావోస్‌లో జరిగిన 24వ క్రిస్టల్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ తారలు ఎల్టన్ జాన్, కేట్ బ్లాంచెట్లతో కలిసి ఆయన అవార్డు అందుకున్నారు. మహిళలు, పిల్లల హక్కులు కాపాడటం కోసం తనదైన కృషి చేస్తున్న కారణంగా ఆయనకు ఈ అవార్డు అందజేస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది.