మహిళా ఏఎస్పీ, సీఐ మధ్య బంధం బలపడింది ఓటుకు నోటు కేసు దర్యాప్తులోనే!
- ఏసీబీలో సీఐగా పనిచేసిన మల్లికార్జున్ రెడ్డి
- ఓటుకు నోటు కేసు దర్యాప్తులో భాగమైన సునీతరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి
- వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడంతో పెరిగిన సాన్నిహిత్యం
- మల్లికార్జున్ రెడ్డి వివరణ పేరుతో వాట్స్ యాప్ సందేశం చక్కర్లు
ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇన్ స్పెక్టర్ గా ఉన్న మల్లికార్జున్ రెడ్డిని ఏసీబీ నుంచి బదిలీ చేశారు. అయినప్పటికీ వారి మధ్య సాన్నిహిత్యం మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. వివాదం రేగిన అనంతరం మల్లికార్జున్ రెడ్డి వివరణ పేరుతో వాట్స్ యాప్ లో ఒక సందేశం చక్కర్లు కొడుతోంది.
తమది వివాహేతర సంబంధం కాదని, సునీతతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారని, ఆమెకు విడాకులు మంజూరయిన వెంటనే వివాహం చేసుకోవాలనుకున్నామని, ఈ విషయం సునీతారెడ్డి భర్తకు కూడా చెప్పానని, ఆదివారం రాత్రి సునీతరెడ్డిని ఇంటి వద్ద డ్రాప్ చేసేందుకు వెళ్లానని మల్లికార్జున్ రెడ్డి అన్నట్లు వాట్సప్ సందేశంలో ఉంది. దీనిపై త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్ అన్నట్లు అందులో ఉందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.