ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో జ‌కోవిచ్‌కి అనుకోని ఎదురుదెబ్బ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో జ‌కోవిచ్‌కి అనుకోని ఎదురుదెబ్బ

  • అన్‌సీడెడ్ ప్లేయ‌ర్ చేతిలో ఓడిన మాజీ నెంబ‌ర్ వ‌న్‌
  • రెండు పాయింట్ల తేడాతో ద‌క్షిణ కొరియా ఆట‌గాడి విజ‌యం
  • ఆరు సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ నెగ్గిన జ‌కోవిచ్‌
ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ టెన్నిస్ చ‌రిత్ర‌లో ఓ సంచ‌ల‌నం న‌మోదైంది. ఆరు సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన జ‌కోవిచ్‌, అన్‌సీడెడ్ ప్లేయ‌ర్ చేతిలో ఓడిపోయాడు. నాలుగో రౌండ్‌లో ద‌క్షిణ కొరియాకు చెందిన హియోన్ చంగ్‌, జ‌కోవిచ్‌ను 7-6, 7-5, 7-6 తేడాతో ఓడించాడు. తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కి చేరిన హియోన్ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి మాజీ నెంబ‌ర్ వ‌న్‌ని ఓడించాడు.

మూడు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు సెట్లు టై బ్రేకర్ కాగా, మూడో సెట్‌లో ఫ‌లితం తేలింది. గతంలో జ‌కోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు. గతేడాది కూడా జ‌కోవిచ్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
Australian open
djakovich
south korea

More Telugu News