అల్లు అర్జున్ కొత్త సినిమా ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలుసా?
- బన్ని సినిమాల డబ్బింగ్ వెర్షన్ చిత్రాలకు విశేష స్పందన
- మొత్తం ఏడు భాషల్లో బన్ని ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’
- తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్పురి భాషల్లో విడుదల
ఆయన నటిస్తోన్న సినిమాల డబ్బింగ్ వెర్షన్ చిత్రాలకు విశేష స్పందన వస్తుండడంతో ఈ సారి ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను నేరుగా ఆ రెండు భాషల్లోనే కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్పురి భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బన్ని సరసన అను ఇమ్మాన్యుయేల్ నాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.