Kumaraswami: వెంకటేశ్వర స్వామి కలలో చెప్పాడంటూ, ఒక్క రూపాయికే చీర... కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన మహిళాలోకం!

ఒక్క రూపాయికి ఏం వస్తుంది? కనీసం టీ కూడా రాదుగా అంటారా? అయితే మీరు బీదర్ వెళ్లి రావాల్సిందే. బీదర్ వెళితే, మీకు ఒకే ఒక్క రూపాయికి చీర లభిస్తుంది. తిరుమల వెంకటేశ్వరస్వామి చెప్పారంటూ, 5 లక్షల చీరలను ఒక్కొక్కటీ రూపాయికే అమ్మడాన్ని ప్రారంభించాడో వ్యక్తి. ఈ విషయమై ఇంకాస్త లోతుగా వెళితే, బీదర్ లోని ఓ వస్త్రదుకాణం యజమాని చంద్రశేఖర్, జేడీఎస్ పార్టీ వీరాభిమాని.

ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించి, తమ నేత కుమారస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది ఆయన కోరిక. కొద్ది రోజుల క్రితం వెంకన్న కలలోకి వచ్చి, కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే, 5 లక్షల చీరలను పంచాలని చెప్పాడట. దీంతో కేవలం ఒక్క రూపాయికే చీరను విక్రయించాలని నిర్ణయించానని, 15 రోజుల పాటు మాత్రమే ఈ స్కీమ్ అమలులో ఉంటుందని చెబుతున్న చంద్రశేఖర్ దుకాణం ముందు ఇప్పుడు మహిళలు బారులు తీరారు.
Kumaraswami
Bidar
Saree for One Rupee

More Telugu News