అందుకే, ‘అర్జున్ రెడ్డి’లో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నా: హీరోయిన్ పార్వతి నాయర్
- హీరో, దర్శకుడు కొత్త వ్యక్తులని భావించా
- కథలో ముద్దు సీన్లు, శ్రుతిమించిన సన్నివేశాలు
- సినిమా విడుదలైన తర్వాత చూశా
- నటించనందుకు చాలా బాధపడ్డా: పార్వతి నాయర్
‘సందీప్ రెడ్డి నన్ను కలిసి కథ చెప్పారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి కొత్త వ్యక్తులని అనుకున్నా. దీనికి తోడు, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నాకు ఇబ్బందిగా అనిపించాయి. ముఖ్యంగా, ముద్దు సన్నివేశాలతో పాటు శ్రుతి మించిన సన్నివేశాలూ ఉన్నాయి. అందుకే, ఈ సినిమాలో నటించనని చెప్పేశా’ అని నాటి విషయాన్ని పార్వతి నాయర్ గుర్తుచేసుకుంది.
ఈ సినిమా కథ చదివినప్పుడు, విన్నప్పుడు సాధారణంగా ఉందని చెప్పిన పార్వతి నాయర్, కొత్త దర్శకుడు నైపుణ్యాన్ని గుర్తించలేకపోయానని చెప్పింది. ఈ సినిమాను తెరపై చూసిన తర్వాత దానిని వదులుకున్నందుకు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా మరో సినిమాలో నటించలేకపోయిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. 2015లో వచ్చిన తమిళ సినిమా ‘అరువి’లో తనను నటించమని కోరారని, కథలో భాగంగా గుండు చేయించుకోవాలని చెప్పడంతో అప్పుడు కూడా ‘నో’ అనాల్సి వచ్చిందని పార్వతి నాయర్ చెప్పింది.