Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి బరాత్‌లో తల్వార్లతో విన్యాసాలు.. బాలుడి మృతి.. 10 మంది బాలుర అరెస్ట్

  • షేక్‌పేటలో ఘటన
  • స్నేహితులు పిలిస్తే వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలుడు
  • హైదరాబాద్‌లో తరుచూ ఇటువంటి ఘటనలు
హైదరాబాద్‌లోని షేక్‌పేటలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహ వేడుక అనంత‌రం జ‌రిపిన‌ బరాత్‌లో మైన‌ర్ బాలురు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. తల్వార్లతో విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో సయ్యద్‌ హమీద్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి మెడ‌కి బ‌లంగా త‌ల్వార్ త‌గ‌ల‌డంతో తీవ్ర రక్తస్రావం జ‌రిగి మృతి చెందాడు.

ఇటీవ‌ల జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు 10 మంది మైన‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులు పిలిస్తే పెళ్లి బ‌రాత్ కు వెళ్లి సయ్యద్‌ హమీద్ మృత్యువాత ప‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు. హైద‌రాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో క‌త్తులు, త‌ల్వార్ల వంటి ఆయుధాలతో యువ‌కులు విన్యాసాలు చేస్తూ ప‌దే ప‌దే ప‌ట్టుబ‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.       
Hyderabad
shakepet
boy died

More Telugu News