కాలేజీలో మహిళా ప్రిన్సిపాల్ ను తుపాకీతో కాల్చి చంపిన విద్యార్థి
- హర్యానాలో దారుణ ఘటన
- విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్
- ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన 12వ తరగతి విద్యార్థి
ఆమెపై కాల్పులు జరిపి పారిపోయిన సదరు విద్యార్థి అనంతరం తనకు తానుగా వచ్చి పోలీసులకి లొంగిపోయాడు. రితా చబ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రితా చబ్రా తనను తిట్టిన కారణంగానే ఆమెను ఆ విద్యార్థి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థి వద్దకు ఆ తుపాకీ ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.