ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా: హీరోయిన్ హరిప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా: హీరోయిన్ హరిప్రియ

  • మంచి కథలు కావాలి 
  • చెప్పినట్టుగా తెరపై చూపించే దర్శకుడు కావాలి
  • నా పాత్ర బాగుండాలి అనే చూస్తాను  
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో హీరోయిన్ హరిప్రియ మాట్లాడుతూ, తనకు సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించారు. "నా దగ్గరకు వచ్చిన కథ, పాత్ర గురించి నేను పూర్తిగా వినేదానిని. బాగుంది అనుకుంటే వెంటనే ఓకే చెప్పేసే దానిని. 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' .. 'ఈ వర్షం సాక్షిగా' సినిమాల విషయంలో అదే జరిగింది" అని ఆమె తెలిపారు.

విడుదలైన తరువాత థియేటర్లో ఆ సినిమాలు చూసినప్పుడు, నాకు చెప్పినట్టుగా మనసుకు హత్తుకునేలా ఆ కథలను ఆవిష్కరించలేదనిపించింది. కథ వింటూ ఫీలైన నేను .. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ ఫీల్ మిస్సయిందనిపించింది. అందువల్లనే కథ .. నా పాత్ర ఈ రెండు మాత్రమే కాదు, మంచి టీమ్ కూడా ముఖ్యమని నేను భావిస్తున్నాను. అలా వున్నప్పుడే నేను ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.  
haripriya

More Telugu News