box office: చైనా బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్న ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' చిత్రం

భార‌తదేశ సినిమాల‌కు చైనాలో డిమాండ్ పెరిగింది. మొన్న‌టికి మొన్న ఆమిర్‌ఖాన్ న‌టించిన 'దంగ‌ల్' చిత్రం భారీ వ‌సూళ్లు సాధించి అక్క‌డ రికార్డులు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' చిత్రం కూడా నిన్న‌ చైనాలో విడుద‌లైంది. మొద‌టిరోజే 6.79 మిలియ‌న్ డాల‌ర్లు (రూ. 43.35 కోట్లు) సాధించి 'దంగ‌ల్' రికార్డులను తిర‌గరాసింది.

హాంకాంగ్‌, మచ్చు ప్రాంతాల్లో ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ వివ‌రాల‌ను బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్‌లో వెల్ల‌డించారు. చైనాలో రూ. 1000 కోట్లు వ‌సూలు చేసి 'దంగ‌ల్' సృష్టించిన రికార్డును ఈ 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' చిత్రం బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
box office
dangal
secret superstar
taran adarsh

More Telugu News