ఆ సినిమా సమయంలో నన్ను బాగా ఆటపట్టించే వాళ్లు: హరిప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమా సమయంలో నన్ను బాగా ఆటపట్టించే వాళ్లు: హరిప్రియ

  • నేను తెలుగు మాట్లాడుతుంటే కన్నడ యాస ఉండేది 
  • అందరూ ఆటపట్టించేవాళ్లు 
  • ఆ తరువాత తెలుగు నేర్చుకున్నాను   
'జై సింహా'లో గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన హరిప్రియ, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకుంది. "తెలుగులో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ 'జై సింహా' చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో తొలిసారిగా నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది.

"మొదటి నుంచి కూడా నేను పెరిగిన వాతావరణంలో తెలుగుపై కన్నడ ప్రభావం ఉంటూ ఉండేది. 'తకిట తకిట' సినిమా సమయంలో కన్నడ యాసతో కూడిన తెలుగు మాట్లాడుతుంటే, ఇక్కడ అంతా ఆటపట్టించేవాళ్లు. ఆ పదానికి అర్థం చెప్పు .. ఈ పదానికి అర్థం చెప్పు అంటూ తప్పులు పట్టుకుంటూ టీజ్ చేస్తుండే వాళ్లు. ఆ తరువాత నేను తెలుగు నేర్చుకున్నాను .. ఇప్పుడు నాకెంతో సంతోషంగా వుంది" అని చెప్పింది.  
haripriya

More Telugu News