Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నై సూప‌ర్‌కింగ్స్ ప్ర‌ధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్‌

  • బ్యాటింగ్ కోచ్‌గా మైఖేల్ హ‌స్సీ
  • బౌలింగ్ కోచ్‌గా ల‌క్ష్మీప‌తి బాలాజీ
  • వెల్ల‌డించిన సీఎస్‌కే నూత‌న చీఫ్ కాశీ
ఐపీఎల్ సీజ‌న్ ఫీవ‌ర్ అప్పుడే మొద‌లైంది. ఇప్ప‌టికే ఆయా జ‌ట్లనే అట్టిపెట్టుకుని ఉన్న ప్లేయ‌ర్ల వివ‌రాలు తెలియ‌డంతో ఫ్రాంచైజీలన్నీ కోచ్‌ల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే) త‌మ జ‌ట్టు కోచ్‌ల‌ను ప్ర‌క‌టించింది. జట్టు ప్రధాన కోచ్‌ గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టీపెన్‌ ఫ్లెమింగ్‌, బ్యాటింగ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌గా భారత ఆటగాడు లక్ష్మీపతి బాలాజీ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు సీఎస్‌కే నూతన చీఫ్‌ కాశీ తెలిపారు.

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టు బరిలోకి దిగుతుంది. గ‌తంలో కూడా ఫ్లెమింగ్ చెన్నై జ‌ట్టుకి కోచ్‌గా పనిచేసిన సంగ‌తి తెలిసిందే. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది.
chennai
super kings
michael hassi

More Telugu News