మాజీ ఎమ్మెల్యే 'బ‌గ్గిడి గోపాల్‌' బ‌యోపిక్ షూటింగ్ ప్రారంభం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ ఎమ్మెల్యే 'బ‌గ్గిడి గోపాల్‌' బ‌యోపిక్ షూటింగ్ ప్రారంభం!

  • హాజ‌రైన కొణిజేటి రోశ‌య్య‌
  • ప్ర‌ధాన పాత్రలో న‌టిస్తున్న బ‌గ్గిడి గోపాల్‌
  • కండ‌క్ట‌ర్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన క్ర‌మ‌మే క‌థాంశం
ఒక సామాన్య ఆర్టీసీ కండ‌క్ట‌ర్ స్థాయి నుంచి శాసన స‌భ్యుడిగా ఎదిగిన బ‌గ్గిడి గోపాల్ జీవిత క‌థ ఆధారంగా ఆయ‌న పేరుతోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. బ‌గ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై ఆయ‌నే న‌టిస్తూ, నిర్మిస్తోన్న బ‌యోపిక్ 'బ‌గ్గిడి గోపాల్: రైటు రైటు టు అధ్య‌క్షా' చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో మ‌హేష్‌, భ‌వ్య‌శ్రీ, శ్వేతారెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా అర్జున్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య ముఖ్యఅతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా,  టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ కెమెరా స్విచాన్ చేశారు.
baggidi gopal
biopic
conductor

More Telugu News