ఏటీఎం కార్డు అంద‌జేస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌... ఆర్డ‌ర్ చేయండిలా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏటీఎం కార్డు అంద‌జేస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌... ఆర్డ‌ర్ చేయండిలా!

  • పేమెంట్స్ బ్యాంక్‌లో డ‌బ్బుల‌ను డ్రా చేసుకునే అవ‌కాశం
  • ప్ర‌స్తుతం ఐఓఎస్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే
  • త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా
త‌మ పేమెంట్స్ బ్యాంక్ వినియోగ‌దారుల‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ‌బ్బులు డ్రా చేసుకునేందుకు వీలుగా పేటీఎం కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. అందుకోసం ఓ డెబిట్ లేదా ఏటీఎం కార్డును అంద‌జేయ‌నుంది. ప్ర‌స్తుతం ఐఓఎస్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ స‌దుపాయం, త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా విస్త‌రించ‌నున్న‌ట్లు పేటీఎం తెలిపింది.

పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్లంద‌రూ ఈ కార్డును పొంద‌వ‌చ్చు. ఇందుకోసం రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం యాప్‌లో బ్యాంక్ సెక్ష‌న్ ఓపెన్ చేసి, డెబిట్ కార్డు సెలక్ట్ చేసుకోవాలి. త‌ర్వాత డెలివ‌రీ అడ్ర‌స్‌ను ఎంపిక చేసుకుని ఏటీఎంను రిక్వెస్ట్ చేసుకోవ‌చ్చు.
payment
paytm
money
users

More Telugu News